📄 ePaper
Sunday, July 26, 2026
Homeఆంధ్రప్రదేశ్డాన్స్ చంపియన్‌షిప్ విన్నర్‌గామెరిసిన త్రినేత్రనాట్యమండలిచిన్నారులు

డాన్స్ చంపియన్‌షిప్ విన్నర్‌గామెరిసిన త్రినేత్రనాట్యమండలిచిన్నారులు

📰 Generate e-Paper Clip


మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్ 4
గోవాలో జరిగిన డాన్స్ హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేషన్2025 లో శ్రీకాళహస్తికి చెందిన త్రినేత్ర నాట్యాలయ శిష్యులు అసాధారణ ప్రతిభ ప్రదర్శించారు.ఈపోటీల్లో పాల్గొన్న చిన్నారులు నేత్రానంద్, నివాసిని, హన్విత తమ గురువు సాయి దత్త మార్గదర్శకత్వంలో అద్భుతమైన భరతనాట్య ప్రదర్శన చేసి చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించారు.ఈ విజయంతో శ్రీకాళహస్తి ప్రాంతం గర్వపడుతోంది. చిన్నారులను ప్రోత్సహించిన తల్లిదండ్రులు, శ్రమపెట్టిన గురువుకు స్థానిక ప్రజలు హృదయపూర్వకఅభినందనలుతెలియజేశారు.

ఈబాలికలను ఆశీర్వదిస్తూ, భవిష్యత్తులో మరెన్నో పురస్కారాలు అందుకోవాలని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular