📄 ePaper
Thursday, October 15, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలునామినేషన్ అభ్యర్థితో ఇద్దరికే అనుమతికలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీ

నామినేషన్ అభ్యర్థితో ఇద్దరికే అనుమతికలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాక(కుకునూరు పల్లి)మండలండిసెంబర్ 5
గ్రామపంచాయతీ ఎన్నికల మూడవ విడత నామినేషన్ ప్రక్రియను జిల్లాలో స్వయంగా పరిశీలించేందుకు జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ కె. హైమావతి గురువారం ఆకస్మికంగా సందర్శించారు.
కలెక్టర్ కుకునూరు పల్లి మండలంకుకునూరు పల్లి క్లస్టర్, అలాగే కొండపాక మండలందుద్దేడ క్లస్టర్ ను పరిశీలించారు.
ఈ క్లస్టర్లలోని కుకునూరు పల్లి, బొబ్బాయి పల్లి, ముద్దాపూర్, రామచంద్రపూర్, అలాగే దుద్దేడ, బందారం, దర్గా గ్రామాల నామినేషన్లు స్వీకరిస్తున్న విధానాన్ని అధికారులు వివరించారు.
కలెక్టర్ హైమావతి మాట్లాడుతూస్టేట్ ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం జిల్లాలో మూడవ విడత నామినేషన్లుతొమ్మిదిమండలాల్లో జరుగుతున్నాయి.కొన్ని క్లస్టర్లలో అభ్యర్థుల తాకిడి ఎక్కువగా ఉండటం, కార్యాలయాల వద్ద ఎర్పాట్లు సక్రమంగా లేనందున అసంతృప్తి వ్యక్తం చేశారు.ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే టోకెన్ వ్యవస్థ అమలు చేసి వరుసలో నిలుపాలని పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు.ARO, RO ఆఫీసుల్లో రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి నామినేషన్లు వేగంగా స్వీకరించాలన్నారు. క్లస్టర్ పరిధిలో 100 మీటర్ల లోపల గుమిగూడకుండా,నామినేషన్ అభ్యర్థితోపాటుకేవలంఇద్దరినేలోపలికిఅనుమతించాలని పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.నామినేషన్ వేయడానికి గుంపులుగా రావద్దని, నియమాలు పాటించాలని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు.విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని, ఎన్నికల నిర్వహణను క్రమశిక్షణగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.