📄 ePaper
Sunday, August 30, 2026
Homeఆంధ్రప్రదేశ్గ్యాస్ బిల్లులకు మించి వసూళ్లు చేస్తే కఠిన చర్యలుడీలర్లకు కౌన్సిలింగ్ చేసిన జాయింట్ కలెక్టర్ ఎన్.మౌర్య

గ్యాస్ బిల్లులకు మించి వసూళ్లు చేస్తే కఠిన చర్యలుడీలర్లకు కౌన్సిలింగ్ చేసిన జాయింట్ కలెక్టర్ ఎన్.మౌర్య

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//తిరుపతిజిల్లా.డిసెంబర్11
జిల్లాలో గ్యాస్ బిల్లులో పేర్కొన్న మొత్తానికి మించి డబ్బులు వసూలు చేసే గ్యాస్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య స్పష్టం చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం గ్యాస్ డీలర్లతో ఆయన సమావేశమయ్యారు.జిల్లాలోని గ్యాస్ డీలర్లపై భారీగా ఐవీఆర్ఎస్ పాజిటివ్ ఫిర్యాదులు నమోదైనట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. మొత్తం 28 మంది డీలర్ల గురించి వినియోగదారు లనుంచి “బిల్లు కంటే ఎక్కువ వసూలు చేస్తున్నార”న్న ఫిర్యాదులు అందినట్లు వివరించారు. గ్యాస్ డెలివరీ సమయంలో డెలివరీ బాయ్స్ అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఐవిఆర్ఎస్ రిపోర్టులు స్పష్టమైన ఆధారాలు చూపుతున్నాయని తెలిపారు. నియమ నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారులపై భారం మోపే ప్రయత్నాలు చేయకూడదని డీలర్లను హెచ్చరించారు. “ఇలాంటి చర్యలు పునరావృతం అయితే సంబంధిత ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరిస్తాం” అని జాయింట్ కలెక్టర్ మౌర్య స్పష్టం చేశారు. డీలర్లు తమ డెలివరీ సిబ్బందిపై పర్యవేక్షణను పెంచాలని సూచించారు. సమావేశంలో గ్యాస్ పంపిణీ విధానం, వినియోగదారుల సౌకర్యం, పారదర్శకత, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.