📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఅభివృద్ధిసంక్షేమానికేపట్టంకట్టండిఅధికారపార్టీకిఓటేస్తేనేగ్రామాలఅభివృద్ధి:ఎమ్మెల్యేరోహిత్ రావు

అభివృద్ధిసంక్షేమానికేపట్టంకట్టండిఅధికారపార్టీకిఓటేస్తేనేగ్రామాలఅభివృద్ధి:ఎమ్మెల్యేరోహిత్ రావు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మెదక్ జిల్లా.డిసెంబర్11
గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాల్సిందేనని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పిలుపునిచ్చారు. బిఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఓటు వేస్తే పల్లెల అభివృద్ధి ఆగిపోతుందని, పైసల కట్టలు, మద్యం బాటిళ్లతో ప్రజలను మభ్యపెట్టే నాయకులను విశ్వసించవద్దని ఆయన స్పష్టం చేశారు.బుధవారం మెదక్ మండలంలోని మాచవరం, ర్యాలమడుగుగౌ, పేరూరు, రాజ్‌పల్లి, మక్త భూపతిపూర్, పాతూర్ తదితర గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ“సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రతి రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్రామ అభివృద్ధి కావాలంటే ప్రభుత్వం–ఎమ్మెేల్యే–స్థానిక నాయకులు ఒకే పార్టీకి చెందినవారై ఉండాలి. లేదంటే అభివృద్ధి పనులు నిలిచిపోవడం తప్పదు” అని చెప్పారు.బిఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు ఓటేస్తే ఓటు వృథా అవుతుందని హెచ్చరిస్తూ…“మద్యం, డబ్బుతో వచ్చే వారి చెబుతున్న మాయ మాటలు నమ్మొద్దు. మీ ఓటు మీ గ్రామ భవిష్యత్తు. తప్పు వ్యక్తిని ఎంచుకుంటే ఐదేళ్లు పల్లె ఆగిపోతుంది” అని అన్నారు.తన ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాల గురించి వివరించిన ఆయన…రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు పెట్టుబడి సాయం సన్నాలకు రూ.500 బోనస్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కొత్త రేషన్‌కార్డులు సన్న బియ్యం పంపిణీఇందిరమ్మ ఇళ్లు మంజూరు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.“గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా… సీసీ రోడ్లు కావాలన్నా… పల్లె అభివృద్ధి కావాలన్నా… తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే గెలిపించాలి” అని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రంలో మరో మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుందని, ఎమ్మెల్యేగా తన వంతు సేవను ప్రతి గ్రామానికి అందిస్తానని ఆశ్వాసం ఇచ్చారు.ప్రచార కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థులు శ్రీనివాస్ చౌదరి, నాగరాజు, ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజ్ మోల్సాబ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్, అలాగే స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.