📄 ePaper
Friday, July 10, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుదుద్దెడలో జోష్‌… ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం: సర్పంచ్ అభ్యర్థి ఆరేపల్లి శ్రీనివాస్

దుద్దెడలో జోష్‌… ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం: సర్పంచ్ అభ్యర్థి ఆరేపల్లి శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.సిద్దిపేటజిల్లాడిసెంబర్12
కొండపాక మండలం దుద్దెడ గ్రామం ప్రస్తుతం ఎన్నికల వేడి జోష్‌తో కదలాడుతోంది. ఈ క్రమంలో సర్పంచ్ పదవికి కత్తెర గుర్తుతో పోటీ చేస్తున్న ఉన్నత విద్యావంతుడు, సామాజిక సేవాభావం గల యువకుడు ఆరేపల్లి శ్రీనివాస్ శుక్రవారం గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.యువత, శ్రేయోభిలాషులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ప్రచారం సందడి ఏకంగా పండుగ వాతావరణాన్ని సృష్టించింది. ప్రతి వీధి, ప్రతి చౌరస్తాలో శ్రీనివాస్‌కు అహ్వానం తెలిపిన గ్రామస్థుల స్పందన ఉత్సాహాన్ని నింపింది.
ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ శ్రీనివాస్“నా లక్ష్యం పదవి కాదు… ప్రజల సమస్యల పరిష్కారమే నా నిజమైన ధ్యేయం” అన్నారు.గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ,
తాగునీరు.అంతర్గత రహదారులు.డ్రైనేజ్ వ్యవస్థసీసీ రోడ్లుస్ట్రీట్ లైట్లువంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు కట్టుబడి పనిచేస్తా నని హామీ ఇచ్చారు.అలాగే, ప్రభుత్వ పథకాలు మధ్యవర్తులు లేకుండా ప్రతి ఇంటికి చేరేలా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని తెలిపారు.
యువత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నానని, విద్యావకాశాలు నైపుణ్యాభివృద్ధిస్థానిక ఉపాధి అవకాశాల సృష్టిదిశగా చర్యలు చేపడతానని వెల్లడించారు.“గ్రామం మారాలి… మన పిల్లల భవిష్య త్తుమెరుగుపడాలి…మీ ఒక్క ఓటు నాకు శక్తి ఇస్తుంది”అంటూఓటర్ల ను ఆశీర్వదించాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular