మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//డిసెంబర్ 22
మెదక్ జిల్లా&మండలం జానకంపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా నెల్లి భూదెమ్మ నర్సింలు,2 వార్డు మార్గం మల్లేశం, వార్డు నెల్లి స్వరూప,4 వార్డు గోకుల మౌనిక,5 వార్డు మార్గం లక్ష్మీ నరసవ్వ,6 వార్డు గుడాల మంగమ్మ,7 వార్డు మార్గం బిక్షపతి,8 వార్డు మార్గం సిద్ధిరాములు. ప్రమాణ స్వీకారం చేసారు.ఈ సందర్భంగా జానకంపల్లి గ్రామ ప్రజలు తమపై ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్పంచ్ నెల్లి భూదెమ్మ నర్సింలు మీడియాతో మాట్లాడారు. గ్రామ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వార్డు మెంబర్ల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఆయన తెలిపారు.మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను జానకంపల్లి గ్రామానికి సమర్థవంతంగా చేర్చేలా కృషి చేస్తానని అన్నారు. ప్రతి గ్రామస్థుడికి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.గ్రామాభివృద్ధే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తూ, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలు, పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. తనను గెలిపించిన జానకంపల్లి గ్రామ ప్రజలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సర్పంచ్ నెల్లి భూదెమ్మ నర్సింలు పేర్కొన్నారు.
జానకంపల్లి గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా:సర్పంచ్ నెల్లి భూదెమ్మ నర్సింలు
RELATED ARTICLES

