📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఆకస్మికంగా మరణించిన కుటుంబాలకు బిటిఆర్ ఫౌండేషన్ ద్వారా అండగా నిలిచిన బెంద్రం తిరుపతి రెడ్డి

ఆకస్మికంగా మరణించిన కుటుంబాలకు బిటిఆర్ ఫౌండేషన్ ద్వారా అండగా నిలిచిన బెంద్రం తిరుపతి రెడ్డి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మనకొండూరు,డిసెంబర్24
ఇల్లంతకుంట మండలంలోని గాలిపెల్లి గ్రామానికి చెందిన కేశవేని రాజేశం, వరకొలు కొమరవ్వ, అలాగే వల్లంపట్ల గ్రామానికి చెందిన పండుగ మల్లవ్వ ఆకస్మికంగా మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించిన బేంద్రం తిరుపతి రెడ్డి బిటిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యం బస్తాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఏ కష్టం వచ్చినా, ఎలాంటి ఆపద వచ్చినా తాను అండగా నిలిచి సహాయం చేస్తానని తెలిపారు. బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తూ వారి దుఃఖాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో గజ్జల శ్రీనివాస్, కేశవేని భూమేశ్, కోమటిరెడ్డి అనిల్, కేశవేని శ్రీనివాస్, అప్పాల రాజేశం, బట్టు మల్లేశం, వరకొలు ఆంజనేయులు, వరకొలు సంతోష్, పొన్నాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.