📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమాడిగి గ్రామపంచాయతీ పాలకవర్గం ఘన ప్రమాణ స్వీకారం

మాడిగి గ్రామపంచాయతీ పాలకవర్గం ఘన ప్రమాణ స్వీకారం

📰 Generate e-Paper Clip

మొగుడంపల్లి,డిసెంబర్24(మనప్రజాప్రతినిధి)
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని మాడిగి గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గం సోమవారం (డిసెంబర్22) స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌గా హర్షత్ జామ పటేల్, ఉప సర్పంచ్‌గా సవిత రంగారెడ్డి, అలాగే వార్డు సభ్యులు ఉదయం 10:30 గంటలకు గ్రామపంచాయతీ కార్యదర్శి నీషత్ ఆధ్వర్యంలో పదవి ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణ స్వీకార అనంతరం నిర్వహించిన సన్మాన సభలో ముఖ్య అతిథులుగా మొహమ్మద్ హతీక్ హైమద్, శ్రీనివాస్ రెడ్డి, గఫర్ మియా, వెంకట్ రెడ్డి, నారాయణ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.నూతన పాలకవర్గం గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.