📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసిరిసిల్లలో ఘనంగా క్రిస్మస్ వేడుకలుపాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు

సిరిసిల్లలో ఘనంగా క్రిస్మస్ వేడుకలుపాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్ 25
రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బీవై నగర్ బెతేస్త చర్చ్‌లో పాస్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ వేడుకల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏసుక్రీస్తు చూపిన శాంతి, ప్రేమ, కరుణ మార్గాలు సమాజానికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. అన్ని వర్గాల మధ్య సోదరభావం, పరస్పర గౌరవం మరింత బలపడాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, ఎస్సీ సెల్ నాయకులు ఆకునూరి బాలరాజుతో పాటు ఇతర ముఖ్య నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.వేడుకల అనంతరం పాస్టర్. క్రైస్తవ పెద్దలు కాంగ్రెస్ నాయకులను శాలువాలతో సత్కరించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు, స్థానిక ప్రజలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.