మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్26
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సర్పంచ్ మిద్దె శివకుమార్, ఉప సర్పంచ్ పల్లె జానకి యాదగిరితో పాటు వార్డు సభ్యులకు దుద్దెడ కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజాసేవలో నిజాయితీ, బాధ్యతతో పనిచేస్తూ గ్రామ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని నూతన ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఆదర్శ పాలన అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాది శ్రీకాంత్ శాలువాలతో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
గ్రామాభివృద్ధికి ముందడుగు… నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం.
RELATED ARTICLES

