📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవానికి జోష్ తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో ఘన వేడుకలు.

కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవానికి జోష్ తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో ఘన వేడుకలు.

📰 Generate e-Paper Clip

ఉద్యమాల పార్టీ కాంగ్రెస్‌కి ఘన నివాళి
శ్రీకాళహస్తిలోకాంగ్రెస్ జెండా ఎగురవేసి శక్తి ప్రదర్శన
తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో ఘన వేడుకలు 

మనప్రజాప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్ 28
141వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి, కేక్ కట్ చేసి ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరిపారు.కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా వివిధ హోదాల్లో సేవలందించిన సీనియర్ నాయకులు, పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు గారిని ఘనంగా సన్మానించి ప్రత్యేక గౌరవం అందించారు.ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ… 140 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదలు, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని, భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి దేశ ప్రజలకు స్వేచ్ఛను అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.ఈనాడు దేశం అభివృద్ధి బాటలో సాగుతోందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల ఫలితమేనని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు, ఐఐటీలు, ఐసర్ వంటి ఉన్నత విద్యాసంస్థలు, ప్రభుత్వ వైద్య కళాశాలలు, సాంకేతిక విప్లవం, గ్లోబలైజేషన్, ఇస్రో వంటి సంస్థల ఏర్పాటు ద్వారా భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో ముందుండేలా నడిపించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు.అలాగే కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల పార్టీ అని, ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి, తిరుపతి జిల్లాలో డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు నాయకత్వంలో పార్టీకి పూర్వ వైభవం తిరిగి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న తిరుపతి జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్ రాయల్, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోని వార్లను దుశాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అజిత్, నాగరాజు, అరుణ్, మహేష్, చరణ్, మాస్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.