Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుకుసుమ రామయ్య పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనోత్సవం.

కుసుమ రామయ్య పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనోత్సవం.

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల,జనవరి3
సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాలలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమాలతో ఈ వేడుకలను నిర్వహించింది.
మహిళా ఉపాధ్యాయులకు ఘన సత్కారంఈ సందర్భంగా పాఠశాల లో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించా రు. సావిత్రిబాయి పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ విద్యా రంగంలో విశేష సేవలు అందిస్తున్నందుకు గాను వారిని గౌరవ ప్రదంగా సత్కరించారు.చదువే సామాజిక మార్పుకు ఆయుధం
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్ గారు మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే జీవితం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. సమాజంలో వేళ్లూనుకున్న అనేక సామాజిక దుష్ప్రవర్త నలకు ఏకైక పరిష్కారం ‘చదువు’ మాత్రమేనని ఆమె గట్టిగా నమ్మినట్టు గుర్తు చేశారు.మహిళల విద్యపై తీవ్ర ఆంక్షలు ఉన్న కాలంలోనే వాటిని ఎదుర్కొని, బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు స్థాపించిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.
నేటి తరానికి స్ఫూర్తినేటి బాలబాలికలు సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను తప్పనిసరిగా చదివి, ఆమె ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular