Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుసిద్దిపేట కురుమ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల,వ్యాసరచన పోటీలు

సిద్దిపేట కురుమ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల,వ్యాసరచన పోటీలు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం,జనవరి3
కురుమ ఉద్యోగుల సంఘం (సిద్దిపేట జిల్లా) ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.ఈ పోటీల్లో కురుమ ఉద్యోగులు, మహిళలు, యువత మరియు పిల్లలందరూ పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ముగ్గుల, వ్యాసరచన పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నట్లు, అవి క్యాలెండర్ ఆవిష్కరణ రోజున విశిష్ట అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేయబడతాయని వెల్లడించారు.ముగ్గుల పోటీలో పాల్గొనేవారు తాము వేసిన ముగ్గుల ఫోటోలను, వ్యాసరచన పోటీలో పాల్గొనేవారు క్రింద పేర్కొన్న అంశాలలో ఏదైనా ఒక అంశంపై వ్యాసం రాసి, దాని ఫోటోను 09 జనవరి లోపు తప్పనిసరిగా పంపించాల్సిందిగా తెలిపారు.
వ్యాసరచనకు నిర్ణయించిన అంశాలు-కురుమ కులంలో బాలికల విద్య – సామాజిక మార్పుకు పునాది,కురుమ మహిళలు, బాలికలు సమాజంలో ఎదుర్కొంటున్న సవాళ్లు – పరిష్కార మార్గాలు.
ఈ కార్యక్రమాల నిర్వహణ సజావుగా సాగేందుకు కన్వీనర్లను నియమించినట్లు తెలిపారు. వ్యాసరచన పోటికి బైతీ దుర్గయ్య (ఉపాధ్యాయుడు), వాసర అజయ్ కుమార్ (పోలీస్) కన్వీనర్లుగా వ్యవహరించనుండగా, ముగ్గుల పోటికి బండారి అర్చన (ఉపాధ్యాయురాలు), బట్టు స్వప్న (JL) కన్వీనర్లుగా బాధ్యతలు చేపడతారని తెలిపారు.నమోదు, ఫోటోలు మరియు వ్యాసాలు పంపుటకు సంబంధించి మరిన్ని వివరాల కోసం
P. రవికాంత్ (ప్రెసిడెంట్) – 9908135269,
V. శ్రీకాంత్ (జనరల్ సెక్రటరీ) – 99513981222,
B. మల్లేశం (ట్రెజరర్) – 9490054118
నంబర్లను సంప్రదించవలసిందిగా సూచించారు.
కార్యక్రమానికి సంబంధించిన తేదీ, సమయం మరియు వేదిక వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు సంఘం పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular