📄 ePaper
Saturday, August 29, 2026
Homeఎడిటోరియల్జిల్లా కలెక్టర్ కె హైమావతి పర్యటన

జిల్లా కలెక్టర్ కె హైమావతి పర్యటన

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాక మండల్:

మర్పడగ గ్రామంలో సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోమధ్యాహ్న బోజనం లో భాగంగా మెను ప్రకారం కిచిడీ, కూర, గుడ్డు వండి పెడుతున్నారా అంటూ భోజనం చేస్తున్న విద్యార్థుల ను అడిగితెసుకున్నారు కలెక్టర్ హైమావతి.వంట గది, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులను, సిబ్బందిని ఆదేశించారు. క్రమశిక్షణ పాటిస్తూ, శ్రద్దగా చదువుకోవాలని విద్యార్థులకు చెప్పారు.బోధనతో పాటు పాఠశాల నిర్వహణ ను సరిగ్గా చూడాలని ఉపాధ్యాలును ఆదేశించారు.  అసంపూర్తిగాఉన్న ప్రహరీ గోడ, టాయిలెట్ విషయాన్నీ ప్రిన్సిపల్ కలెక్టర్ దృష్టికి తేగా సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు కాల్ చేసి పనులు పూర్తి చేయాలనీ ఆదేశించారు. అనంతరం పల్లెదవాఖనాను సందర్శించిన జిల్లా కలెక్టర్ దవాఖాన మొత్తం కలియతిరుగుతూ  లోపల చెత్త చెదారం లేకుండా శుభ్రం చేయించాలని పంచాయతీ సెక్రటరీని ఆదేశిస్తు, గ్రామంలోని ప్రెగ్నెన్సీ మహిళలు వివరాలు, టిబి, షుగర్ పేషంట్ లను తరుచు మానిటర్ చెయ్యాలని తెలిపారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు.
గ్రామంలో శానిటేషన్ డ్రైవ్ చెప్పట్టాలని, మోరీలలో చెత్త చెదారంతో నిండిపోయి మురికి నీరు నిల్వ ఉండడం చూసి అసహనం వ్యక్తం చేస్తూ, మోరీలలో నీరు ఉంటే దోమలు పెరిగి రోగాలు వ్యాప్తి చెందుతాయి కాబట్టి, మొత్తం శుభ్రపరచే చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి ని ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.