📄 ePaper
Friday, August 28, 2026
Homeతెలంగాణమాజీ ఐపీఎస్ అధికారి ఇంటి వద్ద దుండగుడి హల్‌చల్

మాజీ ఐపీఎస్ అధికారి ఇంటి వద్ద దుండగుడి హల్‌చల్

📰 Generate e-Paper Clip

– అర్ధరాత్రి ఘటనతో జూబ్లీహిల్స్‌లో కలకలం
– అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

హైదరాబాద్, జనవరి 8 (మనప్రజాప్రతినిధి):


వీకే సింగ్ నివాసం వద్ద అర్ధరాత్రి ఓ దుండగుడు హల్‌చల్ సృష్టించాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటిపై దాడికి యత్నించిన ఘటన నిన్న అర్ధరాత్రి చోటుచేసుకుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
సమాచారం ప్రకారం, ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఆయుధాన్ని లాక్కునే ప్రయత్నం దుండగుడు చేశాడు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన ఇతర సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. వారి చురుకైన చర్యల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. నిందితుడిని ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు గల కారణాలు, దుండగుడి ఉద్దేశాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.