📄 ePaper
Tuesday, July 14, 2026
Homeఆంధ్రప్రదేశ్మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గుడిమల్ల పరశురామేశ్వర ఆలయం సర్వాంగ సుందరం.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గుడిమల్ల పరశురామేశ్వర ఆలయం సర్వాంగ సుందరం.

📰 Generate e-Paper Clip

చైర్మన్ బత్తలగిరి నాయుడు ఆధ్వర్యంలో శరవేగంగా అభివృద్ధి పనులు
🔸 మహాశివరాత్రికి గుడిమల్ల పరశురామేశ్వర ఆలయం నూతన వైభవం
🔸 ప్రతి అభివృద్ధి పనిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న చైర్మన్ బత్తలగిరి నాయుడు
🔸 భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా ముందస్తు భారీ ఏర్పాట్లు
🔸 గ్రామ ప్రజలు, భక్తుల నుంచి విస్తృత ప్రశంసలు
మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.జనవరి10
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని ఏర్పేడు మండలం గుడిమల్లలో వెలసి ఉన్న శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల మనసు దోచుకునేలా అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది.
శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఆలయ చైర్మన్ బత్తలగిరి నాయుడు ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నారు.ఆలయ ఈవో రామచంద్ర రెడ్డి, కమిటీ సభ్యులు, సిబ్బంది ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ శ్రమిస్తున్నారు.
మహాశివరాత్రి నాడు లక్షలాది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణం, పరిసర రహదారులు, పారిశుధ్యం, లైటింగ్, భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు.ప్రతి పనిని స్వయంగా పరిశీలిస్తూ నాణ్యతలో ఎక్కడా లోపం లేకుండా చూసుకుంటున్న చైర్మన్ బత్తలగిరి నాయుడు సేవలకు గ్రామ ప్రజలు, భక్తులు నీరాజనం పలుకుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular