📄 ePaper
Thursday, July 16, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకురుమ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ

కురుమ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సిద్దిపేటజిల్లా,జనవరి10
కురుమ ఉద్యోగుల సంఘం – సిద్దిపేట జిల్లా (Regd. No. 157/2021) ఆధ్వర్యంలో నిర్వహించిన “స్వాగతం – సుస్వాగతం” కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది. సిద్దిపేట పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం భవన్‌లో (సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన) జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ హర్యానా గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.ఈ సందర్భంగా కురుమ ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ను బండారు దత్తాత్రేయ గారు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సత్కరించారు.తదనంతరం జరిగిన ఆత్మీయ సమావేశంలో కుల బంధువుల ఐక్యత, సమాజ అభివృద్ధి, కురుమ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.ఈ కార్యక్రమంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన కురుమ సర్పంచులు, ఉపసర్పంచులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కురుమ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు పోతుగంటి రవికాంత్, కోశాధికారి బండారి మల్లేశం, ప్రధాన కార్యదర్శి వాసూరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విందులో బండారు దత్తాత్రేయ పాల్గొని భోజనం చేశారు.కురుమ ఉద్యోగులు, కుల బంధువులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ సంఘ అధ్యక్షులు, కార్యదర్శి వర్గం కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular