📄 ePaper
Tuesday, September 1, 2026
Homeతెలంగాణనవభారత్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు..

నవభారత్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు..

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//హుస్నాబాద్:


హుస్నాబాద్ పట్టణంలోని నవభారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ముందస్తుగా సంక్రాంతి  వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల కరస్పాండెంట్ గంగరవేని రవి ఆద్వర్యంలో ప్రసన్నకుమార్,
పాఠశాల ఉపాధ్యాయులు కలిసి కుటీరం,ఎద్దులబండి, గంగిరెద్దులు, హరిదాసులు గోదాదేవి వివిధ వేషధారణలతో విద్యార్థులు అందరినీ అలరించారు. సంక్రాంతి పండుగను కనులకు కనువిందు చేసేటట్లు విద్యార్థులు తమ ఆటపాటలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులు సంక్రాంతి ముగ్గులు వేశారు. అమ్మాయిలకు ముగ్గుల పోటీ, అబ్బాయిలకు పతంగుల పోటీ నిర్వహించి బహుమతులు అందజేశారు.  సంక్రాంతికి సంబంధించిన నాటిక ప్రదర్శనలు చేశారు.
పాలు పొంగించడం, భోగి మంటలు, ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ,పోషకులు పాల్గొని సంక్రాంతి సంబరాలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.