📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుయువత చదువు–క్రీడల్లో సమతుల్యత సాధించాలి:గ్రామసర్పంచ్ శివకుమార్

యువత చదువు–క్రీడల్లో సమతుల్యత సాధించాలి:గ్రామసర్పంచ్ శివకుమార్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి19
క్రీడలతో మానసిక ఉల్లాసం, స్నేహభావం పెరుగుతుంది
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో స్వర్గీయ ఉనుగూరి సత్తయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు ఉనుగూరి జైపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుద్దెడ గ్రామస్థాయి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి యువత సెల్‌ఫోన్లకు బానిసలవుతున్న ఈ తరుణంలో క్రీడలు యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తాయని అన్నారు. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని, స్నేహభావం మరింత బలపడుతుందన్నారు. ఉరుకుల పరుగుల ఆధునిక సమాజంలో యువత మానవీయ విలువలను కోల్పోతున్నారని, చదువులతో పాటు క్రీడల్లోనూ యువత రాణించాలని పిలుపునిచ్చారు.తండ్రి జ్ఞాపకార్థం ఇలాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, భవిష్యత్‌లో మరిన్ని ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించి తమ ఊరి పేరును నలుమూలలా తీసుకెళ్లాలని సూచించారు.ఈ టోర్నమెంట్‌లో దమ్ టీం మొదటి బహుమతిగా కప్‌తో పాటు రూ.11,000 నగదు, ఇబ్రహీం టీం రెండో బహుమతిగా కప్‌తో పాటు రూ.5,000 నగదు గెలుచుకున్నాయి. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన ఉనుగూరి జైపాల్‌ను సర్పంచ్ శివకుమార్‌తో పాటు హాజరైన నాయకులు అభినందించారు.ఈ కార్యక్రమంలో మంచాల శ్రీనివాస్, పెద్దంకుల శ్రీనివాస్, నూనె కుమార్, గోనె శ్రీనివాస్, అనంతుల నరేందర్, ఆరేపల్లి మహాదేవ్, చిలుముల రామ్మోహన్, గురజాడ బాలాజీ, నర్ర సంతోష్, తదితర నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.