Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలువిశ్రాంత మండల విద్యాధికారి డి.అంజయ్య సేవలకు ఘన గుర్తింపు..

విశ్రాంత మండల విద్యాధికారి డి.అంజయ్య సేవలకు ఘన గుర్తింపు..

📰 Generate e-Paper Clip

రక్తదానం నుంచి బాల కార్మికుల పునరావాసం వరకు… విలువలతో కూడిన విద్యకు అంకితమైన సేవలకు బ్రహ్మకుమారి సంస్థ ఘనసత్కారం.
సదాశివపేట,జనవరి19(మనప్రజాప్రతినిధి)
సంగారెడ్డి జిల్లా విశ్రాంత మండల విద్యాధికారి డి. అంజయ్య చేసిన విశిష్ట సేవలకు రాజస్థాన్ రాష్ట్రం మౌంట్ అబూలోని బ్రహ్మకుమారి సంస్థ ఘనంగా గుర్తింపు ప్రకటించింది. బ్రహ్మకుమారి సంస్థ నిర్వహించిన ఆధ్యాత్మిక రాజయోగ సమ్మేళనంలో ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.డి.అంజయ్య 47 సార్లు రక్తదానం చేయడం, సుమారు 800 మంది బాల కార్మికులను గుర్తించి బడిబాట పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం, ఎన్.సి.సి. అధికారిగా విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించడం, విలువలతో కూడిన విద్యను అందించడం వంటి అనేక సామాజిక, విద్యా కార్యక్రమాలను విజయ వంతంగా నిర్వహించారు.ఈ సేవలను గుర్తించినబ్రహ్మకుమారి సంస్థ సమాజసేవ విభాగం ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకుమెమెంటో అందజేసి సత్కరించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మరియు బ్రహ్మకుమారి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న “సంఘం” ప్రాజెక్టు ద్వారా సీనియర్ సిటిజన్స్‌కు గౌరవం కల్పించి, వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సంస్థ ప్రతినిధులు కోరారు.ఈ కార్యక్రమం పలువురు ప్రముఖుల సమక్షంలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది.
ఇట్లు
డి. అంజయ్య
విశ్రాంత మండల విద్యాధికారి

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular