•రైతుల భూ హక్కులకు భద్రతే లక్ష్యం
•ప్రతినెల 2 నుంచి9వ తేదీ వరకు రాజముద్ర పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
•రీసర్వే, మ్యుటేషన్, రెవెన్యూ క్లినిక్‌లపై కఠిన ఆదేశాలు
•రాజముద్ర పాసు పుస్తకాలు, రీసర్వే,భూ సమస్యల పరిష్కారానికి డెడ్‌లైన్లు…కలెక్టర్ కఠిన ఆదేశాలు
•ఈకేవైసీ నుంచి మ్యుటేషన్ వరకు…రెవెన్యూ వ్యవస్థకు స్పీడ్ గవర్నర్ తీసేసిన ప్రభుత్వం
తిరుపతి,జనవరి19(మనప్రజాప్రతినిధి)
రాష్ట్రంలో రైతుల భూ హక్కులకు సంపూర్ణ భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో రెవెన్యూ వ్యవస్థకు వేగం పెరిగిందని, అధికారులు కూడా పనుల్లో మరింత చురుకుగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్పష్టమవుతోంది.
రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ప్రతి నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తప్పనిసరిగా నిర్వహించా లని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియకు సంబంధించిన పెండింగ్ పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.సోమవారం తిరుపతి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పీజీఆర్‌ఎస్, రెవెన్యూ అంశాలైన పట్టాదారు పాసు పుస్తకాలు, ఆర్‌ఓఆర్, పాత రికార్డులడిజిటలైజేషన్, మ్యుటేషన్, సుమోటో కాస్ట్ సర్టిఫికెట్లు, అందరికీ ఇళ్లు, రీసర్వే తదితర అంశాలపై ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షి, డీఆర్‌ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోస్మాండ్, తిరుపతి ఆర్టీవో రామ్మోహన్‌లతో కలిసి అన్ని మండలాల తహసీల్దారులతో జూమ్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈకేవైసీ, బయోమెట్రిక్, రీసర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం, భూమి వర్గీకరణ వంటి సమస్యల కారణంగా పాసు పుస్తకాల పంపిణీలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని, వాటిని రెవెన్యూ అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.జిల్లాలో రెవెన్యూ క్లినిక్‌లు నిరంతరం నిర్వహించేలా ఆర్టీవోలు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. క్లినిక్‌ల నిర్వహణపై రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, వీఆర్వో స్థాయి నుంచి ఆర్డీఓ వరకు అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు.మ్యుటేషన్‌కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలని, అవి బి అండ్ ఎస్‌ఎల్‌కు వెళ్లకుండా ఆర్డీఓలు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. సుమోటో కాస్ట్ సర్టిఫికెట్లు 100 శాతం జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.నీటి పన్నుల వసూలులో ప్రజలను ఇబ్బంది పెట్టకుండా అవగాహన కల్పిస్తూ జిల్లా అభివృద్ధికి సహకరించాలని అధికారులను కోరారు. అలాగే అందరికీ ఇళ్ల పథకం కింద లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తిచేసి, పోజెషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించారు. రీసర్వే మొదటి, రెండవ దశ పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

