Friday, February 27, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుసమస్యలకు ముందే పరిష్కారం-అభివృద్ధే లక్ష్యం

సమస్యలకు ముందే పరిష్కారం-అభివృద్ధే లక్ష్యం

📰 Generate e-Paper Clip

•“సమస్యలు రాకముందే నివారణే మా పాలన నినాదం-అభివృద్ధిలో ప్రతి వీధికీ ప్రాధాన్యం”

•“పారదర్శక పాలనతో గ్రామాభివృద్ధికి కొత్త దిశ”
•“ప్రజల భాగస్వామ్యంతో సమస్యలేని గ్రామ నిర్మాణమే లక్ష్యం”తిమ్మారెడ్డిపల్లిలో తొలి గ్రామసభలో సర్పంచ్ వెంకటేశం గౌడ్ స్పష్టం
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి20
గ్రామ ప్రజల సమస్యల పరిష్కారమే తన ఏకైక లక్ష్యమని తిమ్మారెడ్డిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ కొయ్యడ వెంకటేశం గౌడ్ స్పష్టం చేశారు. కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో సోమవారం నిర్వహించిన తొలి గ్రామసభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.రెండు సంవత్సరాల పాటు ప్రత్యేక అధికారుల పాలనలో జరిగిన ఆదాయ–వ్యయాల వివరాలను గ్రామస్థులకు చదివి వినిపించిన సర్పంచ్, ఇకపై సమస్యలు వచ్చిన తర్వాత కాకుండా రాకముందే నివారణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పాఠశాలల వసతులు, మౌలిక సదుపాయాల అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
గ్రామంలో ఏ వీధిలోనూ సమస్యలు తలెత్తకుండా సమిష్టి కృషితో అభివృద్ధి బాటలో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో పారదర్శక పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ గ్రామసభలో ఉప సర్పంచ్ ప్రేమలత, పంచాయతీ సెక్రటరీ మల్లారెడ్డి, జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ప్రసన్నమని, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular