📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్గ్రామీణ పశుపోషకులకు వరం…ఉచిత మెగా పశు వైద్య శిబిరానికి అపూర్వ స్పందన!

గ్రామీణ పశుపోషకులకు వరం…ఉచిత మెగా పశు వైద్య శిబిరానికి అపూర్వ స్పందన!

📰 Generate e-Paper Clip

రేణిగుంట గొల్లపల్లిలో రాస్ ఆధ్వర్యంలో 67 పశువులకు ఉచిత వైద్య సేవలు…36కుటుంబాలకు లబ్ధి.
రాస్ మెగా పశు వైద్య శిబిరంతో గ్రామీణ పశుపోషకులకు మేలు.రేణిగుంటమండలం,జనవరి20(మనప్రజాప్రతినిధి):
రేణిగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో రాష్ట్రీయ సేవా సమితి (రాస్), రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా పశు వైద్య శిబిరం గ్రామీణ పశుపోషకులకు నిజమైన వరంగా మారింది. ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి అపూర్వ స్పందన లభించింది.రాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెంకటరత్నం, నాగరాజు వారి ఆదేశాల మేరకు రాస్ మహిళా పొదుపు సంఘాల కుటుంబాల సౌకర్యార్థం ఈ శిబిరాన్ని నిర్వహించారు. రాస్ కృషి విజ్ఞాన కేంద్రం పశు వైద్యాధికారి డాక్టర్ అనూష ఆధ్వర్యంలో నిపుణులైన వైద్య బృందం విస్తృత స్థాయిలో సేవలు అందించింది.ఈ శిబిరంలో మొత్తం 67 పశువులకు వైద్య సేవలు అందించగా, 37 దూడలకు పిడుదులు, గోమార్లు నివారణకు మందులు స్ప్రే చేశారు. 18 పశువులకు సాధారణ చికిత్సలు, 12 పశువులకు గర్భకోశ చికిత్సలు అందించగా, 12 మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరం ద్వారా 36 కుటుంబాలు ప్రత్యక్షంగా లబ్ధి పొందాయి.అంతకుముందు నిర్వహించిన అవగాహన సమావేశంలో పశువుల ఆరోగ్య సంరక్షణ, చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణపై రైతులకు స్పష్టమైన సూచనలు అందించారు. అనారోగ్య పశువులకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం శిబిరానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.ఈ కార్యక్రమంలో రాస్ అధికారులు రవి, అంబలగన్, రామానుజులు, శంకరయ్య, స్వాతి, జ్యోతి, ఉష తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.