Saturday, March 21, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుదళిత ఉపాధ్యాయుడిపై అమానుష దాడి… దోషులపై వెంటనే ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్...

దళిత ఉపాధ్యాయుడిపై అమానుష దాడి… దోషులపై వెంటనే ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్

📰 Generate e-Paper Clip

దళిత ఉపాధ్యాయుడిపై దాడి అంటే దళిత సమాజంపై దాడే…దోషులపై వెంటనే ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి!
మైసగళ్ళ బుచ్చేంద్ర మాదిగ,ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు
ఏర్పేడు.మునిపల్లి,జనవరి20(మనప్రజాప్రతినిధి):
మునిపల్లి మండలం చిన్న చల్మెడ గ్రామానికి చెందిన దళిత ఉపాధ్యాయుడు చంద్రయ్యపై జరిగిన అమానుష, దౌర్జన్య దాడిని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి ఆలస్యం లేకుండా ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మైసగళ్ళ బుచ్చేంద్ర మాదిగ మాట్లాడుతూ, దళితులపై దాడులు పెరుగుతున్నా పాలకులు మౌనంగా ఉండటం ఆందోళనకరమన్నారు. మండలంలో గాని జిల్లాలో గాని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ ఘటనపై మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్‌కు ఎమ్మార్పీఎస్ నాయకులు పిటిషన్ సమర్పించి, దోషులను వెంటనే అరెస్టు చేసి దళిత ఉపాధ్యాయుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సంగమేష్ మాదిగ, నల్లోల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ (ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి), మునిపల్లి మండల అధ్యక్షులు విజయ ప్రసాద్ మాదిగ, సదాశివపేట మండల అధ్యక్షులు మోహన్ మాదిగ, చౌటకూర్ మండల అధ్యక్షులు ఎర్రోళ్ల రమేష్ మాదిగ, శీను మాదిగతో పాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular