📄 ePaper
Saturday, October 17, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలు77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీపీఐ కార్యాలయం ముందు జాతీయ జెండా ఎగరవేత.

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీపీఐ కార్యాలయం ముందు జాతీయ జెండా ఎగరవేత.

📰 Generate e-Paper Clip

•పేదలు–ధనికుల మధ్య పెరుగుతున్న అంతరం,కార్పొరేట్ శక్తుల ఆధిపత్యంపై సీపీఐ నేతల ఘాటు విమర్శలు
సదాశివపేట,జనవరి26(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట పట్టణంలోని సీపీఐ కార్యాలయం ఎదుట 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి దేశాభివృద్ధి, ప్రజాస్వామ్య విలువలపై సీపీఐ నాయకులు ప్రసంగించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి గణతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ పేదలు–ధనికుల మధ్య అంతరం రోజురోజుకూ పెరుగుతూనే ఉందని విమర్శించారు. దేశ సంపద మొత్తం కార్పొరేట్ శక్తులైన ఆదాని, అంబానీల చేతుల్లోకి వెళ్లిపోయిందని, మోదీ పాలన అంతా వారి సంపద పెంపే లక్ష్యంగా కొనసాగుతోందని ఆరోపించారు.
ఈ 77 ఏళ్లలో దేశం మరింత అభివృద్ధి చెందాల్సి ఉండగా, ప్రస్తుతం వెనుకబాటుకు గురవుతోందని పేర్కొన్నారు. మరోవైపు దేశంలో మతోన్మాదం పెరిగిపోతుండగా, కులాలు–మతాల మధ్య చిచ్చులు రేపడంలో బీజేపీ ముందుందని విమర్శించారు. ప్రజల హక్కులు కాపాడుకోవాలంటే పోరాటమే మార్గమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎండి. షఫీ అన్సోజా, బుజ్జమ్మ, వినోద్, పూలమ్మ, దేవి భాయ్, ఆర్. లక్ష్మి, ఏఐటీయూసీ మండల కార్యదర్శి శంకరప్ప, సాదికలి ముస్తఫా, యాకూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.