Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ..

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ..

📰 Generate e-Paper Clip

•డా.బీఆర్ అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయాలని పిలుపునిచ్చిన-నేషనల్ కాంగ్రెస్ వారియర్ సిద్దిపేటజిల్లా అధ్యక్షులు గజబింకర్ అశోక్
మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లిమండలం.జనవరి26
అక్బర్‌పేట్ భూంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాల్ నర్సాగౌడ్ నాయకత్వం వహించారు.
ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజబింకర్ అశోక్,దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుపాతూరివెంకటస్వామి గౌడ్,జిల్లా కార్యదర్శి ఏలూరుకమలాకర్.మహిళమండల అధ్యక్షు రాలుసుమలత,ఎల్పులయాదగిరి(డైరెక్టర్),సురేందర్ రెడ్డి.బాలు. మధు,గుండాశంకర్,బల్తీవెంకటేశం.కుమార్.మల్లేశం.పున్నమ్మస్వామి.తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు,స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గజబింకర్ అశోక్ మాట్లాడుతూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమానత్వం,న్యాయం, సౌభ్రాతృత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజల సంకల్పం, ఐక్యత, విద్యాభ్యాసం, సమాజ సేవా భావనలను పెంపొందించడమేగణతంత్ర దినోత్సవం యొక్క అసలైన ఉద్దేశమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం స్థానిక ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు జాతీయ చైతన్యాన్ని మరింత బలోపేతం చేసేలా సాగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular