📄 ePaper
Sunday, June 28, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఉత్తమ ప్రిన్సిపల్‌గా సత్యనారాయణరెడ్డికి అవార్డు

ఉత్తమ ప్రిన్సిపల్‌గా సత్యనారాయణరెడ్డికి అవార్డు

📰 Generate e-Paper Clip

కళాశాల విద్యాభివృద్ధికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారం


సిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//జనవరి26
సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్) ప్రిన్సిపల్ సత్యనారాయణరెడ్డి ఉత్తమ ప్రిన్సిపల్‌గా అవార్డును అందుకున్నారు. కళాశాల విద్యాభివృద్ధికి ఆయన అందించిన విశేష సేవలను గుర్తించిన ప్రభుత్వం, ఆయనను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది.77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ హైమావతి చేతులమీదుగా ఈఅవార్డునుసత్యనారాయణరెడ్డి స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగించిందన్నారు. తన ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగుతోందని, ఇప్పటివరకు నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తు, కళాశాల అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా తన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు దేవయ్య, సుధాకర్ రెడ్డి, కనక చంద్రం, శ్రీనివాస్ రెడ్డి, అశోకు, నగేష్, రాజ్యలక్ష్మి, రఘురాజు, వెంకటరమణ, గంగాధర్, నరేందర్ రెడ్డి, శ్రీకాంత్, రాజశేఖర్ రెడ్డి, నిఖిల్ తదితరులు పాల్గొని ప్రిన్సిపల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular