📄 ePaper
Sunday, June 28, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఇర్కోడ్ గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఇర్కోడ్ గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

ప్రధానకూడళ్ల వద్ద కులసంఘాల ఆధ్వర్యంలో జెండాఆవిష్కరణ”
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గ.జనవరి26
సిద్దిపేట జిల్లా రూరల్ పరిధిలోని ఇర్కోడ్ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద కుల సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి గణతంత్ర వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.ప్రైమరీ, హై, మోడల్ స్కూల్ విద్యార్థులు, యువ నేతలు, కుల సంఘాల నాయకుల సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ ఘనపురం కృష్ణ, ఉప సర్పంచ్ బొప్పిడి రాజవ్వ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులు భారీ ర్యాలీతో పాల్గొని జెండా ఆవిష్కరణను ఘనంగా తిలకించారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఘనపురం కృష్ణ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించిందని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఐక్యతతో గ్రామాభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.26 జనవరి ప్రత్యేకత: 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా గణతంత్ర దినోత్సవం దేశ ప్రజలకు జాతీయ చైతన్యం, రాజ్యాంగ విలువలను గుర్తు చేసే మహత్తర దినంగా నిలుస్తుందని పేర్కొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular