Friday, February 27, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్ఉపాధి హామీని రద్దు చేస్తే గ్రామీణ ఉద్యమాలే: సీపీఐ హెచ్చరిక

ఉపాధి హామీని రద్దు చేస్తే గ్రామీణ ఉద్యమాలే: సీపీఐ హెచ్చరిక

📰 Generate e-Paper Clip

కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సిపిఐ ధర్నాలు
మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.ఫిబ్రవరి02
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తే తీవ్ర ఉద్యమాలు తప్పవని సిపిఐ నేతలు హెచ్చరించారు. సిపిఐ పార్టీ పిలుపుమేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి రూరల్, తొట్టంబేడు మండలాల్లో ధర్నాలు నిర్వహించి అనంతరం వినతిపత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ, గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, అలాగే దినసరి వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా చర్యలు చేపడుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మహాత్మా గాంధీ పేరును పక్కనబెట్టి జి-రామ్-జి పేరుతో పథకాన్ని మార్చడం ఆశ్చర్యకరంగా ఉందని, ఇది పూర్తిగా అనుచితమని వారు విమర్శించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో వామపక్ష పార్టీల కృషితో 2006లో ఈ చట్టాన్ని తీసుకువచ్చారని, దీని ద్వారా గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించబడాయని గుర్తు చేశారు.
ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ‘వికసిత్ భారత్ – జి రామ్ జి’ పేరుతో పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తోందని, ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే గ్రామీణ కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తులసి రాజన్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు చారులత, నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య, రేణిగుంట మండల కార్యదర్శి వైయస్ మణి, ఏర్పేడు మండల కార్యదర్శి సర్దార్ శివ, **శ్రీకాళహస్తి రూరల్ కార్యదర్శి మించల శివకుమార్

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular