•తాను చదివిన కుసుమ రామయ్య ఉన్నత పాఠశాలకు భారీ విరాళం-పేద విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాట
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.ఫిబ్రవరి07
పేద మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, ప్రభుత్వ పాఠశాలలో చదివి కష్టసాధ్యమైన ప్రయాణం ద్వారా అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడిన డా.కుసుమ విట్టల్ మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు.తాను చదువుకున్న సిరిసిల్లలోని కుసుమ రామయ్య ఉన్నత పాఠశాలకు రూ.10 లక్షల విరాళం అందజేసి పేద విద్యార్థుల భవిష్యత్తుకు చేయూతనిచ్చారు.ఈ విరాళం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థుల విద్యాఅవసరాలు మౌలిక వసతులు మరియు ప్రతిభాభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగ పడాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్థిక ఇబ్బందులు విద్యకు అడ్డుకాకూడదనే లక్ష్యంతో ఈ సహాయం అందించడం విశేషం.
ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తన మూలాలను మరవకుండా, తాను ఎదిగిన పాఠశాలకే తిరిగి చేయూతనివ్వడం డా. కుసుమ విట్టల్ దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఈ విరాళం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ “మేము కూడా ఉన్నత స్థానాలకు చేరగలం” అనే ఆశను నింపుతోంది. సిరిసిల్ల ప్రజలు ఆయన సేవాభావాన్ని హృదయపూర్వకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్, స్టాఫ్ సెక్రటరీ శంకర్ గౌడ్, కుసుమ శ్రీధర్, వేముల శ్రీనివాస్, భూమేష్, పురుషోత్తం, ఉపాధ్యాయులు.విద్యార్థులు పాల్గొన్నారు.
“విద్యే భవిష్యత్తు… సేవే నిజమైన సంపద”
రూ.10లక్షల విరాళంతో పాఠశాలకు చేయూత-డా.కుసుమ విట్టల్ సేవాభావానికి ప్రశంసలు
RELATED ARTICLES

