📄 ePaper
Saturday, October 17, 2026
Homeఆంధ్రప్రదేశ్మౌనంగా విలపిస్తున్న కైలాసగిరి…గిరి ప్రదక్షిణకు న్యాయం ఎప్పుడు?

మౌనంగా విలపిస్తున్న కైలాసగిరి…గిరి ప్రదక్షిణకు న్యాయం ఎప్పుడు?

📰 Generate e-Paper Clip

•మహాశివరాత్రి నాటికి మౌలికవసతులు కల్పించాలని డిమాండ్
శ్రీకాళహస్తి,ఫిబ్రవరి7(మనప్రజాప్రతినిధి):
పంచభూత క్షేత్రాల్లో వాయు తత్త్వానికి ప్రతీకగా వెలసిన శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి క్షేత్రాన్ని ఆవరిస్తూ విస్తరించిన సుమారు 22 కిలోమీటర్ల కైలాసగిరి పర్వత శ్రేణి అపారమైన ఆధ్యాత్మిక, పురాణ ప్రాముఖ్యత కలిగినా తగిన అభివృద్ధి లేక నిర్లక్ష్యానికి గురవుతోందని హిందూ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నా రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి పౌర్ణమి, ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ కోసం శ్రీకాళహస్తికి చేరుకుంటున్నప్పటికీ, ప్రదక్షిణ మార్గంలో రహదారులు, వీధి దీపాలు, తాగునీరు, విశ్రాంతి మండపాలు, భద్రత వంటి కనీస సదుపాయాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారనితెలిపారు.తిరువణ్ణామలై అరుణాచలం తరహాలో శ్రీకాళహస్తి కైలాసగిరి గిరి ప్రదక్షిణకు అధికారిక గుర్తింపు ఇచ్చి సమగ్ర అభివృద్ధి చేపట్టాలని, రాబోయే మహాశివరాత్రి నాటికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఇలా జరిగితే కైలాసగిరి గిరి ప్రదక్షిణ శివభక్తుల ఆత్మయాత్రగా మారి, శ్రీకాళహస్తి ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో మరింత ప్రతిష్ట పొందుతుందని పేర్కొన్నారు.

“తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారి రమేష్…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.