•ఫిబ్రవరి12దేశవ్యాప్తసమ్మెలోపాల్గొనాలి:ఎం.నర్సిములు
సదాశివపేట,ఫిబ్రవరి09(మనప్రజాప్రతినిధి):
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక విధానాలు కార్మికులు, రైతులు, కూలీలకు అన్యాయం చేస్తున్నాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. నర్సిములు విమర్శించారు. సదాశివపేట మండలం ఎన్కెపల్లి గ్రామంలో ఉపాధి హామీ కార్మికుల సమస్యలను తెలుసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు.దేశంలో అమల్లో ఉన్న పాత 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం ద్వారా కార్మికుల హక్కులు బలహీనపరచబడుతున్న యని ఆయన అన్నారు. వెంటనే ఆ కోడ్లను రద్దు చేసి పాత చట్టాలను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఉపాధి హామీ పథకానికి సరిపడా నిధులు కేటాయించకుండా కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్మికులకు కనీసం 125 రోజుల పని కల్పించాలంటే తగిన బడ్జెట్ పెంపు అవసరమని, ప్రస్తుతం కేటాయించిన నిధులు చాలవని అన్నారు. పెరుగుతున్న ధరలు, పన్నుల భారంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల హక్కులను కాపాడుకోవాలంటే ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల కు నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీ, ఇక్బాల్, జ్యోతి, వీరేశం, నవీన్, బాబు, సుజావుద్దీన్, శ్రీనివాస్, మనీలా, సువర్ణ, మంజుల తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ హక్కులను కాపాడేందుకు పోరాటం అవసరం
RELATED ARTICLES

