Thursday, April 16, 2026
ads
Homeతెలంగాణభార్య సర్పంచ్ అయినా… పెత్తనం భర్తదే! మంగళపర్తిలో ‘సర్పంచ్ పతి’ హవా

భార్య సర్పంచ్ అయినా… పెత్తనం భర్తదే! మంగళపర్తిలో ‘సర్పంచ్ పతి’ హవా

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మెదక్ జిల్లా వెల్దుర్తి

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామంలో ప్రజాపాలనపై చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొంది. గ్రామ సర్పంచ్‌గా మహిళ ఏకగ్రీయంగా ఎన్నికై బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండగా, అధికారిక సమావేశాల నుంచి అభివృద్ధి పనుల పర్యవేక్షణ వరకు అన్ని వ్యవహారాల్లో ఆమె భర్తే కీలక పాత్ర పోషిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.పంచాయతీ తీర్మానాలు, చెక్ పవర్, అధికారులతో సమావేశాలు, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి అంశాల్లో భర్తే ముందుండి వ్యవహరిస్తున్నారని, ఎన్నికైన మహిళా సర్పంచ్ మాత్రం పేరుకే పరిమితమైందని స్థానికులు వాపోతున్నారు. గ్రామ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షురాలిగా కొనసాగుతున్నప్పటికీ, అధికార పరంగా భర్తకే ప్రాధాన్యం కల్పిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మహిళలకు స్థానిక సంస్థల్లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రిజర్వేషన్లు కల్పించి నాయకత్వ అవకాశాలు ఇచ్చినా, క్షేత్రస్థాయిలో మాత్రం ‘సర్పంచ్ పతి’ సంస్కృతి కొనసాగుతుండడం ఆందోళనకరమని మహిళా సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. మహిళా సాధికారతకు ఇది విరుద్ధమని, ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులే స్వయంగా పాలనా బాధ్యతలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గ్రామ మహిళలు, ప్రజాసంఘాలు ఈ అంశంపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి, గ్రామ పాలనలో ఎన్నికైన సర్పంచ్‌కే పూర్తి అధికారాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

మనప్రజాప్రతినిధి//

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular