📄 ePaper
Saturday, August 22, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఇర్కోడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం..

ఇర్కోడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం..

📰 Generate e-Paper Clip

°చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతితల్లిదండ్రుల బాధ్యత: సర్పంచ్ ఘణపురం కృష్ణ.

°”పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది.

మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జూన్28
ఇర్కోడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏఎన్‌ఎం సంతోషి, కార్యక్రమ సూపర్వైజర్ లక్ష్మి, ఆశా వర్కర్లు ఇందిరా, రజిత, లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఘణపురం కృష్ణ హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొప్పిడి రాజవ్వ, వార్డుసభ్యులు,గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషన్‌రావు, కారోబారి శాప ఎల్లం, ఫీల్డ్ అసిస్టెంట్ మధుసూదన్ రెడ్డి,బొప్పిడి శ్రీనివాస్ రెడ్డి గ్రామ ప్రజలు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

“ఒక చుక్క పోలియో మందు.. జీవితాంతం ఆరోగ్యానికి భరోసా”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.