“నూతన అంగన్వాడీ భవనం, సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం
°గత బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి పరుగులు..కాంగ్రెస్ హయాంలోకుంటుపడింది.
“అంగన్వాడీ భవనానికి ఒక గుంట స్థలం విరాళం..
°సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ..ఇర్కోడ్ అభివృద్ధికి మరో ముందడుగు :రవీందర్ రెడ్డి
సిద్దిపేటనియోజకవర్గం,సెప్టెంబర్1(మనప్రజాప్రతినిధి):
సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని ఇర్కోడ్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం భూమి పూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ గణపురం కృష్ణ, ఉపసర్పంచ్ బొప్పిడి రాజవ్వ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో ఇర్కోడ్ గ్రామంలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి, అలాగే గౌడ కమ్యూనిటీ బ్యాలెన్స్ వర్క్ నిధులతో ఇర్కోడ్ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు.
అంగన్వాడీ భవనానికి స్థలం విరాళం
నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి గ్రామ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చల్ల విజేందర్ రెడ్డి సుమారు ఒక గుంట స్థలాన్ని విరాళంగా అందజేశారు. గ్రామ అభివృద్ధి కోసం స్థలాన్ని విరాళంగా ఇవ్వడం పట్ల గ్రామస్తులు ఆయనను అభినందించారు.
ఈ సందర్భంగా మాజీ సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకు నిధులు వెనువెంటనే మంజూరై గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని రంగాల అభివృద్ధికి భరోసా అని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు నిరంతరం కృషి చేసిందని తెలిపారు. ఇర్కోడ్ గ్రామ అభివృద్ధికి భవిష్యత్తులోనూ తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సర్పంచ్ గణపురం కృష్ణ, ఉపసర్పంచ్ బొప్పిడి రాజవ్వ కోరారు. గ్రామ మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గణపురం కృష్ణ, ఉపసర్పంచ్ బొప్పిడి రాజవ్వ, బొప్పిడి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మారెడ్డి లింగారెడ్డి, బంధారం పరశురాములు, బొర్ర శేఖర్, వాసూరి శేఖర్, కత్తి శ్రీనివాస్, బాలగోని స్రవంతి శ్రీనివాస్, ఎం.డి. సల్మాన్, గోపాల శ్రవణ్, బండి శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అంగన్వాడీ టీచర్ కొత్త అరుణ,గౌడ కులస్తులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.



