“తక్షణమే స్పందించి ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.నవంబర్21
మండలంలోని జప్తినాచారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వేడి నీళ్లు మీద పడటంతో ఏడాది వయసున్న చిన్నారి తీవ్రంగా గాయపడింది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారి పుట్టిన వెంటనే తల్లి మరణించడంతో అప్పటి నుంచి నానమ్మ సంరక్షణలో పెరుగుతోంది. ఈ క్రమంలో చిన్నారికి స్నానం చేయించేందుకు వేడి నీళ్లు తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆ నీళ్లు చిన్నారిపై పడటంతో శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న కొండపాక 108 అంబులెన్స్ సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ శివ, పైలట్ శ్రీనివాస్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన చిన్నారికి అంబులెన్స్‌లో అత్యవసర ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తల్లి లేని చిన్నారికి ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది.
నీళ్లు పడి ఏడాది చిన్నారికి తీవ్ర గాయాలు
RELATED ARTICLES



