“ఆరోగ్యవంతమైన మాతృత్వమే లక్ష్యం.. 338 మందితో సోమి వాక్
“మాతృ శిశు మరణాల నివారణకు సమష్టి కృషి
మనప్రజాప్రతినిధి:సిద్దిపేటనియోజకవర్గం.నవంబర్23
సొసైటీ ఆఫ్ మిడ్‌వైఫ్స్ ఇండియా (సోమి) ఆధ్వర్యంలో మాతృ శిశు మరణాలను తగ్గించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆదివారం సిద్దిపేట లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నర్సింగ్ వైద్య కళాశాల సిబ్బంది. విద్యార్థులు ర్యాలీని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌తో పాటు సుప్రియాదేవి, ప్రసన్న, కల్పన, సబిత మేడమ్‌లు పాల్గొన్నారు. నాలుగు విభాగాలకు చెందిన సిబ్బంది, వసతి గృహ కార్మికులు, 338 మంది విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.
ఉదయం 6.40 గంటలకు ప్రారంభమైన సోమి వాక్ ఉదయం 8 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా మాతృ శిశు మరణాల నివారణ, గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు, ప్రసూతి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ నర్సింగ్, ప్రసూతి సేవలు ఎంతో కీలకమైనవని, వైద్యులు, నర్సింగ్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ మాతృ శిశు మరణాల తగ్గింపునకు కృషి చేయాలని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
మాతృ శిశు మరణాల తగ్గింపుపై అవగాహన ర్యాలీ
RELATED ARTICLES



