Monday, April 20, 2026
ads
Homeతెలంగాణసౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినతెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య...

సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినతెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదార్ రాజనర్సింహ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదార్ రాజనర్సింహ గారు సౌదీ అరేబియాలో జరిగిన భయంకరమైన బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఉమ్రా యాత్రికులు, ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన పలువురు మరణించిన సంగతి పట్ల ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదకర సంఘటన మొత్తం రాష్ట్రానికే భారీ వేదనను కలిగించిందని పేర్కొన్నారు. సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం మరియు సంబంధిత అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సంబంధాలు పెట్టుకుని, మరణించినవారి గుర్తింపు మరియు వారి మృతదేహాల రవాణాకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.

మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ఈ కష్టకాలంలో ధైర్యం లభించాలని మంత్రి ప్రార్థించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular