📄 ePaper
Wednesday, July 15, 2026
Homeబిజినేసస్ఉద్యోగులకు ఈపీఎఫ్‌ సంస్థ నుంచి భారీగుడ్‌ న్యూస్‌

ఉద్యోగులకు ఈపీఎఫ్‌ సంస్థ నుంచి భారీగుడ్‌ న్యూస్‌

📰 Generate e-Paper Clip

న్యూఢిల్లీ, నవంబర్ 17 (మనప్రజాప్రతినిధి):

పిఎఫ్‌ ఉద్యోగుల కనీస పెన్షన్‌ మొత్తం పెరగనుంది. ఉద్యోగుల పెన్షన్‌ పథకంలోని కనీస పెన్షన్‌ పెంపు ప్రకటన కేంద్ర ప్రభుత్వంనుంచి ఎప్పుడైనా రావొచ్చు. దీనివల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు లాభం చేకూరుతుంది. పెన్షన్‌ పథకం కింద నెలకు కనీస పెన్షన్‌ను రూ.5,500కు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం నెలకు రూ.1,000 మాత్రమే అందుతోంది. ఇది అమల్లోకి వస్తే కనీస పెన్షన్‌ రూ.4,500 మేర పెరుగుతుంది. ఉద్యోగి సంఘాలు ఈ పెంపును డిమాండ్‌ చేస్తున్నాయి. రాబోయే విశ్వస్థుల మండలి సమావేశంలో దీనిని ఆమోదించే అవకాశముంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఉద్యోగుల పెన్షన్‌ పథకం కింద రూ.1,000 కనీస పెన్షన్‌ అందుతోంది. దీన్ని పెంచాలని చాలా కాలంగా డిమాండ్‌ కొనసాగుతోంది. ఈ ప్రతిపాదనను మండలి సమావేశంలో ఆమోదించవచ్చు. ప్రస్తుతం దాదాపు 78 లక్షల మంది ఉద్యోగులు ఈ పథకం ప్రయోజనాలను పొందుతున్నారు. ఉద్యోగి సంఘాలు పెన్షన్‌ పెంపు కోరుతూ కార్మిక–ఉపాధి శాఖకు విజ్ఞప్తి కూడా చేశాయి. అయితే ప్రభుత్వం ఇంకా అంగీకారం తెలపలేదు. ప్రభుత్వం ఏవైనా మార్పులు చేస్తే అది 11 సంవత్సరాల తర్వాత జరుగుతున్న పెంపు అవుతుంది. చివరిసారిగా 2014లో కనీస పెన్షన్‌ను రూ.1,000కి పెంచారు. ఈ పథకం కింద పెన్షన్‌ పొందడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఉద్యోగి కనీసం ఈ సంస్థ సభ్యుడిగా ఉండాలి. పెన్షన్‌ ప్రయోజనాలు 58 సంవత్సరాల తరువాత ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఈ సంస్థ అనేక లక్షల మంది ఉద్యోగులకు నెలవారీ పెన్షన్‌లు అందిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular