Friday, February 27, 2026
ads
Homeతెలంగాణసిద్దిపేటలో ప్రతి శనివారం ‘ఫోన్–ఇన్’ కార్యక్రమం ప్రారంభించిన సీపీ విజయ్‌కుమార్

సిద్దిపేటలో ప్రతి శనివారం ‘ఫోన్–ఇన్’ కార్యక్రమం ప్రారంభించిన సీపీ విజయ్‌కుమార్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సిద్దిపేట,నవంబర్ 17:

ప్రజల సమస్యలను నేరుగా విని తక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్దిపేట పోలీసు కమిషనర్ విజయ్‌కుమార్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలతో నేరుగా మాట్లాడే ‘ఫోన్–ఇన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రజలకు ఉన్న ఎలాంటి ఫిర్యాదులు, సూచనలు, సమస్యలైనా నిర్భయంగా తెలియజేయాలని సీపీ విజ్ఞప్తి చేశారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచడం, ప్రజలకు చేరువ కావడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లు:
📞 8712667100
📞 8712667306
📞 8712667371ఈ నంబర్లకు కాల్ చేస్తే వెంటనే స్పందించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని సీపీ విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular