సంగారెడ్డి జిల్లామనప్రజాప్రతినిధి//నవంబర్18:
సీసీఐ తాజా నిర్ణయం ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలుకు పరిమితం చేయడాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ వ్యతిరేకించారు.అలాగే పత్తి కొనుగోలుకు ముందు స్లాట్ బుకింగ్ నిబంధనను వెంటనే తీసివేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ..
మూడు జీన్నిగ్ మిల్లిలు ఒకే సారి ప్రారంభించి పత్తి కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కోరారు. ..
ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ
కొత్త నిబంధనలతో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు హరీగోస పెడుతున్నాయని, రైతులకు నష్టం కలిగించే నిబంధనలు ఎత్తివేసి రైతులకు మేలు చేసే నిబంధనలు అమలు చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కోరారు.సీసీఐ పత్తి రైతుల పట్ల పిచ్చిపిచ్చి నిర్ణయాలు మానుకోవాలని సూచించారు. ..సాగు చేసిన కాలం మొదలు అక్టోబర్ వరకు వర్షాలు, వరదలు కారణంగా తెగుళ్లు, కాయ నల్లగామారడం, పత్తి కారిపోవడం లాంటి సమస్యలతో రైతులు సతమతమయ్యారు…
పంటను కాపాడుకోవడానికి సర్వం ధారపోశారు. పెట్టుబడులు పెరిగాయి. యూరియా ధర పెరిగినా వెనుకాడలేదు. దిగుబడులు వచ్చేసరికి సరికొత్త సమస్యలు పత్తిరైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేర్కొన్నారు. ..
ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పరిమితి అధిక దిగుబడులు సాధించిన రైతులకు నష్టం కలిగిస్తుంది.గతంలో 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలనే నిబంధన ఉండేదని, దీనిని తగ్గించడం వల్ల రైతులు నష్టపోతున్నారు.ఇటీవల కురిసిన వర్షాలకు పత్తిలో తేమ శాతం పెరిగిందని ,8 నుంచి 12 శాతంలోపు తేమ ఉంటేనే పత్తి కొనుగోళ్లు చేపడుతామని సీసీనిబంధనలు పెట్టడం సరికాదని, ఇది ముమ్మాటికీ దళారులు, ప్రైవేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేందుకేనని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మండిపడ్డారు. పత్తిలో తేమ శాతం 20 వరకు ఉన్నా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.పత్తి అమ్మాలనుకునే రైతులను మరింత ఇబ్బంది పెట్టేందుకే కపాస్ కిసాన్ యాప్ అనే కొత్త నిబంధన తీసుకురావడంతో రైతులు పత్తి అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందని, ఈ యాప్ వినియోగంపై రైతులకు ఏ మాత్రం అవగాహన లేదని అన్నారు.పత్తి అమ్ముకునేందుకు రైతులు వేలాది రూపాయలు వాహనాల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తున్నదని, రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తున్నదని ఆవేదన చెందారు…
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు హరిగోస పెడుతున్న నష్టం కలిగించే నిబంధనలు ఎత్తివేసి రైతులకు మేలు చేసే నిబంధనలు అమలు చేయాలని కోరారు. ..
సీసీఐ పత్తి రైతుల పట్ల పిచ్చిపిచ్చి నిర్ణయాలు మానుకోవాలి
RELATED ARTICLES

