📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుగ్రామ పాలనలో బీజేపీ ముద్ర… నూతన ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు కమలంపార్టీ ఘన సన్మానం

గ్రామ పాలనలో బీజేపీ ముద్ర… నూతన ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు కమలంపార్టీ ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్21
ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి గ్రామంలో గ్రామ పాలనపై భారతీయ జనతా పార్టీ ప్రభావం మరింత బలపడుతున్నట్లు మరోసారి స్పష్టమైంది. నూతనంగా ఉపసర్పంచ్‌గా ఎన్నికైన తిప్పర వేణి బాలకిషన్తో పాటు, అనంతగిరి గ్రామ వార్డు సభ్యురాలు సిరిసిల్ల అపూర్వ, సిరికొండ గ్రామ వార్డు సభ్యుడు మామిళ్ల రాజులను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించి పార్టీ బలాన్ని చాటారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ మాట్లాడుతూగ్రామస్థాయి నుంచే బలమైన నాయకత్వాన్ని నిర్మించడమే బీజేపీ లక్ష్యం. ప్రజల విశ్వాసంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలనకు కట్టుబడి పని చేయాలి” అని సూచించారు.బీజేపీ నాయకుల ఐక్యత, క్రమశిక్షణే పార్టీ విజయాలకు మూలమని పేర్కొంటూ, రాబోయే ఎన్నికల్లో గ్రామస్థాయిలో కమలం పార్టీ మరింత పటిష్టంగా నిలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు పండగ లక్ష్మణ్, రెడ్డి ముత్తారెడ్డి, పినికాశి అనిల్, బూత్ అధ్యక్షులు తడిసిన శ్రీధర్, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ జెండాలతో నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular