📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలి

ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలి

📰 Generate e-Paper Clip

–ఇన్స్పెక్టర్ వెంకటేష్
సదాశివపేట,జనవరి14(మనప్రజాప్రతినిధి)
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెల్టూర్ గ్రామంలో ట్రాఫిక్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు.రోడ్లపై ద్విచక్ర వాహనాలు నడిపే యువత తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రాంగ్ రూట్‌లో ప్రయాణం చేయరాదని అన్నారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ మాట్లాడటం, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్‌టేక్ చేయడం, సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు.అలాగే రాత్రి పూట నిద్రమత్తులో వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని కోరారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా పోలీస్, రవాణా, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే “అరైవ్ అలైవ్ – 2026” అని తెలిపారు. ఈ కార్యక్రమం కింద జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెంకటేష్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular