📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలువాగు నీళ్లపై రాజకీయ అండతో అక్రమ లిఫ్ట్‌లు

వాగు నీళ్లపై రాజకీయ అండతో అక్రమ లిఫ్ట్‌లు

📰 Generate e-Paper Clip

అక్రమంగా నీటి లిఫ్ట్‌లు,ఎండిపోతున్న వందల ఎకరాల పంటలు
మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేటభూంపల్లిమండలం.దుబ్బాక నియోజకవర్గం.సిద్దిపేటజిల్లా.జనవరి4
అక్బర్‌పేట భూంపల్లి మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రుద్రారం గ్రామ శివారులోని కూడవెళ్లి వాగు నుంచి మోతె గ్రామానికి చెందిన కొందరు సర్పంచ్‌లు, రాజకీయ నాయకులు అక్రమంగా నీటిని లిఫ్ట్‌ల ద్వారా తరలిస్తున్నా రని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వాగుకు ఆనుకొని ఉన్న రుద్రారం రైతులను బెదిరింపులకు గురి చేస్తూ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు అండతో ఈ అక్రమ నీటి తరలింపుజరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ చర్యల వల్ల రుద్రారం, కాసులాబాద్, మల్లుపల్లి గ్రామాలకు చెందిన వందల ఎకరాల పంటభూములు సాగునీరు లేక ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది.ఈ సమస్యను ఈరోజు శ్రీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు రైతులు తెలిపారు. తమ సమస్యను ఎలాగైనా పరిష్కరించి న్యాయం చేయాలని ఆయనను కోరినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రెడ్డిపల్లి యాదవ రెడ్డి‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular