📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ వాల్ ఆవిష్కరణ

మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ వాల్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

•కొండపాకలో ఎమ్మెల్యే హరీష్ రావు
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి5
మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆదివారం కొండపాకలో ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎనిమిదో తేదీ నుంచి అనంతుల శారద స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
గెలుపు–ఓటములను పక్కనపెట్టి, స్నేహపూర్వక వాతావరణంలో క్రీడాకారులు పోటీల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రధాన లక్ష్యమని హరీష్ రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల రాజలింగం, బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటరెడ్డి, అనంతుల ప్రశాంత్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular