📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఅల్మాజీపూర్ గ్రామ సర్పంచ్‌గా మీరపోరం పద్మ మల్లేశం ఏకగ్రీవ ఎన్నిక

అల్మాజీపూర్ గ్రామ సర్పంచ్‌గా మీరపోరం పద్మ మల్లేశం ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేటభూంపల్లిమండలం,దుబ్బాక నియోజకవర్గం.సిద్దిపేట జిల్లా డిసెంబర్5
అక్బర్‌పేట భూంపల్లి మండల పరిధిలోని అల్మాజీపూర్ గ్రామంలో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ మీరపోరం పద్మ మల్లేశం మరియు వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులుబండారుదుర్గవ్వ – బీరయ్య పోచమైన – పద్మ స్వామి.గుజ్జుల చంద్రం – బాలరాజు.వంగ నర్సింహారెడ్డి – చంద్రారెడ్డి.బండారు కనకయ్య – మల్లయ్య.మండల నర్సింలుగ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏకగ్రీవంగా విజయం సాధించిన నాయకులను అభినందిస్తూ బక్కి వెంకటయ్య, గ్రామాభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రవి, నాయకులు బోయ శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ వడ్ల ప్రభాకర్, పుణ్యమైన కృష్ణహరి, బొల్లు స్వామి, పర్స ప్రవీణ్, కుర్మ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular