📄 ePaper
Monday, July 27, 2026
Homeఆంధ్రప్రదేశ్తల్లిదండ్రులఆప్యాయతసమావేశంఘనంగానిర్వహించినదుర్గిపేరిప్రాథమిక మోడల్ పాఠశాల

తల్లిదండ్రులఆప్యాయతసమావేశంఘనంగానిర్వహించినదుర్గిపేరిప్రాథమిక మోడల్ పాఠశాల

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.డిసెంబర్ 5
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం దుర్గిపేరి ప్రాథమిక మోడల్ పాఠశాలలో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.కార్యక్రమం ప్రారంభంలో సరస్వతీ దేవి పూజ నిర్వహించి, జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు అర్పించారు. అనంతరం విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలిస్తూ తల్లిదండ్రులకు అవసరమైన సూచనలు ఉపాధ్యాయులు అందించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, ప్రతిరోజూ పాఠశాలకు నిరంతరంగా హాజరు కావాలని, బోధనలను శ్రద్ధగావినిచదువులో రాణించాలని సూచించారు.ఇంటి వద్ద కూడా పిల్లలకు చదువుపట్ల ఆసక్తి కలిuగించే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.పాఠశాల అభివృద్ధికి ప్రతి తల్లిదండ్రి తమ వంతు సహకారం అందించాలని ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. సమావేశంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విస్తృతంగా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular