📄 ePaper
Tuesday, July 28, 2026
Homeఆంధ్రప్రదేశ్శ్రీకాళహస్తిట్రైబల్ బాలికలకాలేజీలోఆత్మీయసమావేశం3.0నిర్వహణ

శ్రీకాళహస్తిట్రైబల్ బాలికలకాలేజీలోఆత్మీయసమావేశం3.0నిర్వహణ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్ 5
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి ట్రైబల్ బాలికల సంక్షేమ పాఠశాల–కళాశాలలో ప్రిన్సిపల్ లలిత ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం 3.0 కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్, హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ రవికుమార్, శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్‌–ఇన్స్పెక్టర్ హరిత ముఖ్య అతిథులుగా విచ్చేశారు.ప్రారంభంలో ప్రిన్సిపల్, సిబ్బంది అతిథులను పుష్పగుచ్ఛాలతో సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన ప్రిన్సిపల్ లలిత మాట్లాడుతూ,“విద్యార్థులు – తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల మధ్య ఆత్మీయ బంధాన్ని పటిష్టం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం” అని పేర్కొన్నారు. విద్యార్థుల అకడెమిక్ ప్రగతిపై పూర్తి నమ్మకంతో 100% ఉత్తీర్ణత సాధించేందుకు కళాశాల కట్టుబడి ఉన్నట్టు ఆమె హామీ ఇచ్చారు.హైకోర్టు అడ్వకేట్ రవికుమార్ మాట్లాడుతూ,“చదువు పేదరికం నుంచి బయటపడే గొప్ప ఆయుధం. తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టుకోవాలి. ప్రేమతో, నిబద్ధతతో చదువుకుంటేనే సమాజంలో గౌరవంగా తలెత్తుకోవచ్చు” అని విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశం అందించారు.తదుపరి మాట్లాడిన ఎస్‌ఐ హరిత మాట్లాడుతూ,“మహిళలు సమాజంలో రాణించాలంటే విద్య చాలా అవసరం. తల్లిదండ్రుల కష్టాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు” అని అభిప్రాయపడ్డారు.కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ సుమలత, తల్లిదండ్రులు, అధ్యాపక–అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular