📄 ePaper
Thursday, August 13, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఇరుకోడులో వైభవంగా రాజశ్యామల దేవి నవరాత్రులు

ఇరుకోడులో వైభవంగా రాజశ్యామల దేవి నవరాత్రులు

📰 Generate e-Paper Clip


మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.ఆగస్టు13
సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని ఇరుకోడు గ్రామంలో శ్రావణమాసంసందర్భంగాశ్రీబృందావనవాసుదేవాలయంలోని శ్రీరాజరాజేశ్వరీ దేవాలయంలో శ్రీ రాజశ్యామల దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 21,22,23 తేదీల్లో శ్రీ వారాహి, రాజశ్యామల, బాలత్రిపురసుందరి, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి ప్రతిష్ఠలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ధూళిపాల సాయిరామ శర్మ.ఆలయనిర్వాహకులు మారెడ్డి మహేందర్ రెడ్డి.ఆలయకమిటీఅధ్యక్షులు వాసూరి ఎల్లయ్య ఉపాధ్యక్షలు కొత్తపల్లిప్రభాకర్.ప్రధానకార్యదర్శిదుంపటిశ్రీనివాస్.ధర్మయ్యగారిమల్లారెడ్డి సభ్యులు తెలిపారు.ఈనెల23వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం రాజశ్యామల దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
అదేవిధంగా నిత్యం యజ్ఞయాగాదులు.శ్రీచక్ర దేవత ఆవాహనం కార్యక్రమం నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular