📄 ePaper
Sunday, August 9, 2026
Homeతెలంగాణకేసీఆర్‌కు అడుగడుగునా ఘన స్వాగతం

కేసీఆర్‌కు అడుగడుగునా ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

నర్సంపేటకు వెళ్తున్న బీఆర్‌ఎస్ అధినేత
దారి పొడవునా నాయకులు, కార్యకర్తల అభివాదం
‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తిన కూడళ్లు
పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ

వరంగల్, ఆగస్టు 9 (మనప్రజాప్రతినిధి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆదివారం వరంగల్ జిల్లా పర్యటనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్ నర్సంపేటకు రోడ్డు మార్గంలో బయలుదేరారు. కేసీఆర్ ప్రయాణిస్తున్న మార్గంలో పలు గ్రామాలు, పట్టణాల కూడళ్ల వద్ద బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. తమ అభిమాన నాయకుడి రాక కోసం రహదారుల వెంట వేచి ఉన్నారు. పలు ప్రాంతాల్లో కేసీఆర్‌కు అభివాదం చేస్తూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. ‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ అంటూ నినాదాలతో రహదారులు మార్మోగాయి. కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు స్థానిక నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్ నర్సంపేటకు వెళ్తున్నారు. సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలను తెలుసుకోనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. గ్రామాలు, పట్టణాల ప్రధాన కూడళ్ల వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో చేరడంతో రహదారుల వెంట సందడి నెలకొంది. కాగా కేసీఆర్ నర్సంపేట పర్యటనకు సంబంధించిన సమాచారంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు మార్గమధ్యంలోని పలు ప్రాంతాల్లో ఎదురుచూస్తూ నినాదాలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular